“విజయోస్తు ఊర్వశి” అంటూ అభినందించి ఆవిష్కరించిన దర్శకసంచలనం వి.వి.వినాయక్ !!

ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన “ఊర్వశి ఓటిటి యాప్” సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడినుంచైనా.. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుని అపరిమితమైన వినోదాన్ని ఆస్వాదించవచ్చు. తన చేతుల మీదుగా ఆవిష్కారమైన “ఊర్వశి ఓటిటి” అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని వి.వి.వినాయక్ ఆకాక్షించారు.

ప్రఖ్యాత రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ “ఊర్వశి ఓటిటి” కార్యాలయం ఆరంభించగా… ఇప్పుడు దర్శక సంచలనం వి.వి.వినాయక్.. “ఊర్వశి ఓటిటి యాప్” లాంచ్ చేయడం తమకు ఎంతో గర్వకారణమని “ఊర్వశి ఓటిటి” డైరెక్టర్ రవి కనగాల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పాల్గొని.. “వినూత్నమైన, విభిన్నమైన వినోదంతో ఉర్రూతలూగిస్తూ…”ఊర్వశి ఓటిటి” శర వేగంతో దూసుకుపోవాలని, సంచలనం సృష్టించాలని ఆకాంక్షించారు!!!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus