సెంటిమెంట్ కోసం ‘పవన్’ మనసు మార్చుకున్నాడు!!!

సహజంగా సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. హీరోల విషయానికి వస్తే….ఎక్కువశాతం హీరోలు సెంటిమెంటుకు పూర్తి వ్యాల్యూ ఇస్తారు. అయితే దూకుడుకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయినటువంటి పవన్ కల్యాణ్ కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు అని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త… ఇంతకీ విషయం ఏమిటంటే…ప్రస్తుతం పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక దగ్గర పడుతున్న క్రమంలో పవన్ సెంటిమెంట్ విషయం బయటకు వచ్చింది. ముందుగా ఈ ఆడియోను, అమరావతి వేదికగా జరపాలి అని అనుకున్నారు, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, అది హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక హైదరాబాద్ లో ‘శిల్పకళావేదిక’లో ఈ ప్రోగ్రామ్ జరపాల్సి ఉండగా, పవన్ మాత్రం ‘నోవేటాల్’ హోటెల్ లో చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

ఎక్కడైతే ‘జనసేన’ ఆవిర్భావం’ జరిగిందో అక్కడే. ఇదిలా ఉంటే….ఇప్పటికీ ఈ ఆడియో వేడుక కోసం అనేక వేదికలను పవన్ దృష్టికి తీసుకు వచ్చారు నిర్మాతలు. అందులో….తొలుత గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలి అని అనుకోగా….గతంలో పవన్ ‘పంజా’ ఆడియో ఫంక్షన్ అక్కడే జరగడంతో, ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో గచ్చిబౌలి స్టేడియంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక పెడితే సెంటిమెంట్ రీత్యా కలిసిరాదు అని పవన్ సన్నిహితులు పవన్ కు చెప్పినట్లు సమాచారం.

ఇక ఆతరువాత నిజాం కాలేజి గ్రౌండ్స్ లో ఈ ఆడియో ఫంక్షన్ నిర్వహిద్దామని ఆలోచన వచ్చినా ఆ వేదిక పై పవన్ పెద్దగా ఆశక్తి చూపకపోవడంతో నిర్మాతలు మరో వేదిక కోసం అన్వేషించారు. ఇక ఆతరువాత వచ్చిన ఆలోచనే శిల్ప కళావేడ్క పవన్ దీన్ని కూడా తిరస్కరించడంతో చివరకు నోవటాల్ లో….హెచ్ ఐ సి సి గ్రౌండ్స్ ను ఈ సర్దార్ పాటల ఆవిష్కరణ వేదికగా మార్చేందుకు సిద్దం అయ్యారు. ఏది ఏమైనా…పవన్ కాస్త సెంటిమెంట్ మనిషే అని ఈ విషయం చూస్తే అర్ధం అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus