ఈ వారం కూడా థియేటర్లలో కంటే ఓటిటిలోనే సందడెక్కువ..!

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా… ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. కొంతలో కొంత గతవారం ‘సీటీమార్’ రిలీజ్ అయ్యింది. ఓపెనింగ్స్ వరకు పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత ఆ చిత్రం కూడా జోరు చూపించలేకపోతుంది.అందులోనూ ఓటిటిలో అంతకంటే పెద్ద సినిమా ‘టక్ జగదీష్’ ‘నెట్’ వంటి సినిమాలు ఉండడంతో.. టాక్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలనే ఎక్కవగా చూస్తున్నారు ప్రేక్షకులు అని స్ఫష్టమవుతుంది. దీనిని బట్టి థియేటర్లకి ఓటిటి డామినేషన్ ఎక్కువే ఉందనేది గమనించవచ్చు. ఈ వారం కూడా ‘మ్యాస్ట్రో’ వంటి పెద్ద సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు అన్న గ్యారెంటీ లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ‘మ్యాస్ట్రో’: డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 17 నుండీ స్ట్రీమింగ్‌ కానుంది.

2) ‘అనబెల్‌.. సేతుపతి’ : సెప్టెంబర్ 17 నుండీ డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

3) అన్‌ హియర్డ్‌ – సెప్టెంబరు 17 నుండీ డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

4) కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ షోఫాహోలిక్‌ – సెప్టెంబరు 17 నుండీ డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

5) ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ : సెప్టెంబరు 17 నుండీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది.

6) డు రె అండ్ మి -సెప్టెంబరు 17 నుండీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది

7) అన్‌కహీ కహానియా – సెప్టెంబరు 17 నుండీ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది

8) ప్రియురాలు – సెప్టెంబరు 17 నుండీ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus