విడుదల కాకుండానే ‘సీక్వెల్’ సిద్దం??

సహజంగా మన టాలీవుడ్ చరిత్రలో సీక్వెల్స్ అచ్చిరావడంలేదు. ఆర్య2, కిక్2, సర్దార్ గబ్బర్ సింగ్, ఇలా ఎన్నో సినిమాలు సీక్వెల్స్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలన్నీ ఆయా తొలి సినిమాల తరువాత సీక్వెల్స్ గా రూపం పోసుకున్నాయి కానీ రేపు విడుదల కాబోతున్న ఒక సినిమాకి అప్పుడే సీక్వెల్ రెడీ చేసేసాడు ఆ సినిమా దర్శకుడు. ఇంతకీ విషయం ఏమిటంటే…రేపు అటు తమిళ ఇటు తెలుగు భాషల్లో భారీ క్రేజ్ మధ్య రిలీజవ్వబోతున్న సూరియ ‘24′ సినిమాకు సీక్వెల్ తీయడానికి ఆల్రెడీ స్కెచ్ గీసేశాడు దర్శకుడు విక్రమ్ కుమార్.

ఈ సీక్వెల్ కోసం అతను ఆల్రెడీ స్టోరీ కూడా రెడీ చేసేసాడు. అయితే  ‘24’కు వచ్చే ఫలితాన్ని బట్టి..  తనతో పాటు సూర్య ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని బట్టి అతను సీక్వెల్ తెరకెక్కించడంపై నిర్ణయం తీసుకుంటాడట. ఇదిలా ఉంటే ‘24’ సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఆడితే ఇది బాలీవుడ్లో రీమేకయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయట. దీని టీజర్.. ట్రైలర్ చూసి బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్ రీమేక్ మీద ఆసక్తి చూపిస్తున్నారు అని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. అంతా బావుంటే ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా విక్రమ్ డైరెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈలోపు ఇప్పటికే విక్రమ్ అల్లు అర్జున్.. మహేష్ బాబు తో ఆల్రెడీ సినిమాలు కమిట్ అయ్యి ఉండడంతో, ఏది చేస్తాడో, ఏది వదులుకుంటాడో అన్న ఆలోచనలో పడ్డాడు. మరి 24ఎంత వరకూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus