మాస్ మహా రాజ్ కి అంత కాన్ఫిడెన్స్ ఏంటి..!

‘రాజా ది గ్రేట్’ తర్వాత ఏకంగా 3 డిజాస్టర్ లు అందుకున్నాడు రవితేజ. అప్పట్లో ఉండే.. రవితేజ ఎనర్జీ లెవల్స్ ఇప్పుడు లేవు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అంతేనా ఇక రవితేజ పని అయిపొయింది… ఎప్పుడు చూసినా అవే మాస్ రొట్ట సినిమాలా? అని కామెంట్ చెయ్యని వాళ్ళు లేరు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టేలానే ఉన్నాడు. వి ఐ ఆనంద్ డైరెక్షన్లో రవితేజ నటించిన తాజా చిత్రం ‘డిస్కో రాజా’. జనవరి 24 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ఇక ఈ చిత్రం గురించి రవితేజ మాట్లాడుతూ..”‘డిస్కోరాజా’ షూటింగ్ సమయం లో ఎంతో ఎంజాయ్ చేసాను… అంతకు మించి రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన పాత్రలను ఆనంద్ నాకు చెప్పాడు. అందుకే వెంటనే సినిమాకు ఒకే చెప్పాను. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించా. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ నా కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే డిస్కోరాజా కి సీక్వెల్ కూడా ఉంటుంది” అంటూ రవితేజ తెలిపాడు. ఏమైనా మన మాస్ మహా రాజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus