Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 హిట్టా ? ఫట్టా ? తేల్చి చెప్పేసిన ఆడియన్స్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అనేది చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఎప్పటిలాగానే హౌస్ మేట్స్ ని స్టేజ్ పైకి పిలుస్తూ వారిని హౌస్ లోకి పంపించి లాక్ చేశారు. ప్రస్తుతం ఈవారం 14మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వీళ్లలో 7గురు మేల్ కంటెస్టెంట్స్ ఉంటే, 7గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, ఈసారి కంటెస్టెంట్స్ లో సీరియల్ ఆర్టిస్ట్ లు బాగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం 3గురు హౌస్ లో మైయిన్ సీరియల్స్ నుంచీ వచ్చారు. జానకి కలగనలేదు సీరియల్ నుంచీ ప్రియాంక జైన్, అమర్ దీప్ అలాగే కార్తీక దీపం నుంచీ మోనిత క్యారెక్టర్ చేసిన శోభాశెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

అలాగే ప్రిన్స్ యవార్ కూడా సీరియల్ ఆర్టిస్టే. అంతేకాదు, వీళ్లతో పాటుగా వచ్చేవారం మరికొంత మంది సీరియల్ ఆర్టిస్ట్ లు రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీళ్లలో దేవత సీరియల్ ఫేమ్ అర్జున్, నెంబర్ వన్ కోడలు సీరియల్ హీరో క్రాంతి రాబోతున్నట్లుగా టాక్. ఇక ముక్కుపుడక సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య పిస్సే కూడా రాబోతుంది. దీన్ని బట్టీ చూస్తే హౌస్ లో పెద్ద సీరియల్ డ్రామానే నడిచేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ మీరు ఊహించని సీజన్ ని చూడబోతున్నారని ఫస్ట్ నుంచీ బిగ్ బాస్ సీజన్ 7 కి ఒక హైప్ ని తీస్కుని వచ్చారు.

అన్నట్లుగానే ఇప్పుడు హౌస్ లో అందరూ సీరియల్ ఆర్టిస్టులే ఉన్నారు. వీళ్ల డామినేషన్ ఖచ్చితంగా ఉండబోతోంది. బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగానే స్క్రిప్ట్ అనేది ఉందని, అందుకే కావాలని మాటీవి సీరియల్స్ తో టైఅప్ ఉన్నవాళ్లనే పెట్టుకున్నారని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ముందుగానే వారికి హౌస్ లో గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి ? ఎలా ఆడాలి అనేది బ్రీఫింగ్ కూడా ఇచ్చారనేది టాక్. రీసంట్ గా జరిగిన నీతోనే డ్యాన్స్ రియాలిటీ షోలో ఉన్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు.

దీన్ని బట్టీ చూస్తే ఈసారి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) భారీ స్కెచ్ వేసినట్లుగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 అనేది పెద్ద హిట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ గట్టి ప్రయత్నాలే చేసింది. ఇందులో భాగంగానే హౌస్ లో హైడ్రామా ఉండాలని, నామినేషన్స్ – ఎమోషన్స్ – కనక్షన్స్ ఇలా అన్నీ కూడా హై రేంజ్ లో పండాలని ఇలా ప్లాన్ చేసిందని ఆడియన్స్ చెప్తున్నారు. అందుకే, ఈ సీజన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ఫస్ట్ వీక్ నుంచీ రేటింగ్స్ హ్యూజ్ గా వచ్చేలా ఇలా ప్లాన్ చేశారనేది టాక్.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus