సీరియల్ నటి భర్త షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

బుల్లితెర నటి శ్రీవాణి టీవీ షోల ద్వారా, సీరియల్స్ ద్వారా రోజురోజుకు పాపులారిటీని ఊహించని రేంజ్ లో పెంచుకుంటున్నారు. ఎలాంటి రోల్స్ లో అయినా అద్భుతంగా నటించే ఈ నటి ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంతో పాటు భారీ స్థాయిలో ఆస్తులను కూడబెట్టారు. సొంతంగా ఈమెకు యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఉన్నాయి. శ్రీవాణి తన భర్త విక్రమ్ తో కలిసి తరచూ బుల్లితెర ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంటారు.

ఈటీవీలో ప్రసారమవుతున్న మిస్టర్ అండ్ మిసెస్ ఒకరికి ఒకరు కార్యక్రమంలో శ్రీవాణి తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా రెండు రోజుల్లో ఈ ప్రోమోకు ఏకంగా 2 లక్షల కంటే ఎక్కువగా వ్యూస్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రోమోలో విక్రమ్ దేవుడిని మనస్పూర్తిగా ఒక కోరిక కోరుకుంటున్నానని కామెంట్ చేశారు. తన భార్య కంటే ఒకరోజు ముందే నేను చనిపోవాలని దేవుడిని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

నేను బ్రతికి శ్రీవాణి చనిపోతే ఏం చేయాలో కూడా నాకు పాలుపోదని శ్రీవాణి భర్త కామెంట్లు చేశారు. ఐ లవ్ యూ పండూ అంటూ విక్రమ్ శ్రీవాణిపై తనకు ఉన్న ప్రేమను కురిపించారు. శ్రీవాణిపై విక్రమ్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విక్రమ్ గ్రేట్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. శ్రీవాణి విక్రమ్ క్యూట్ కపుల్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

నటిగా శ్రీవాణి తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. శ్రీవాణి పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీవాణి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావడంతో పాటు ఎన్నో విజయాలను అందుకోవాలని కొంతమంది చెబుతున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా శ్రీవాణి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus