Lahari: తల్లి కాబోతున్న బుల్లితెర నటి లహరి.. వైరల్ అవుతున్న బేబీ షవర్ ఫొటోస్!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బుల్లితెర నటి లహరి ఒకరు. ఈమె మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చిన బుల్లితెర సీరియల్స్ చక్రవాకం మొగలిరేకులు వంటి సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా ఒక వైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. ఈ విధంగా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి లహరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో నటిస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా ఈమె పాత్రను మనకు సీరియల్ లో చూపించడం లేదు. అయితే అందుకు గల కారణం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో సీరియల్స్ కు కాస్త దూరంగా ఉన్నారు. బుల్లితెర సీరియల్స్ ద్వారా మాత్రమే కాకుండా ఓకే లహరి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె పెద్ద ఎత్తున అభిప్రాక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఇక తన (Lahari) సీమంతానికి సంబంధించిన షాపింగ్ వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే లహరి తాజాగా కుటుంబ సభ్యులు సన్నిహితులు ఇతర బుల్లితెర నటి మనుల సమక్షంలో ఘనంగా సీమంతపు వేడుకలను జరుపుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈమె బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus