Serial Actress: సీరియల్స్ చరిత్రలో మొదటి లిప్ లాక్.. చాలా ఇబ్బంది పడిన హీరోయిన్.!

ఇప్పటి సినిమాల్లో లేదా వెబ్ సిరీస్లలో లిప్ లాక్ సన్నివేశాలు ఉండటం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. కానీ అలాంటి సన్నివేశాల్లో నటించడానికి అందరు నటీమణులు సిద్ధంగా ఉంటారు అనుకోవడం అపోహ మాత్రమే. కొంతమంది అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకప్పుడు సోషల్ మీడియా హవా లేదు కాబట్టి ఇలాంటి విషయాలు నటీమణులు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. సెట్స్ లో ఏమాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వెంటనే సోషల్ మీడియా ముఖంగా బయటపెట్టేస్తున్నారు.

సీనియర్ నటీమణులు (Actress) అయితే గతంలో తాము ఫేస్ చేసిన ఇబ్బందికర పరిస్థితులను డైరెక్ట్ గా బయటపెడుతున్నారు. ఇక విషయంలోకి వెళితే.. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ రేపు విడుదల కాబోతోంది. ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ సిరీస్లో నీనా గుప్తా కూడా నటించింది. ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. గతంలో ఈమె ‘దిల్లగి’ అనే టీవీ సీరియల్ లో నటించింది.

ఆ సీరియల్ లో ఈమె లిప్ లాక్ సన్నివేశంలో నటించిందట. సీరియల్స్ చరిత్రలో లిప్ లాక్ సీన్ పెట్టింది అందులోనే మొదటిసారి. అయితే ఆ సన్నివేశంలో నటించడానికి నీనా గుప్తా చాలా ఇబ్బంది పడిందట. ఆమె లిప్ లాక్ పెట్టిన నటుడు అందంగా ఉన్నప్పటికీ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేకపోవడం వల్ల ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఆ సన్నివేశం షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే డెట్టాల్ తో నోరు కడుక్కుందట ఈ బ్యూటీ.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus