Srivani: శ్రీవాణి యూట్యూబ్ సంపాదన తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

ప్రస్తుత కాలంలో సెలెబ్రెటీలందరూ కూడా సోషల్ మీడియాని అద్భుతమైన ప్లాట్ ఫామ్ ఉపయోగించుకుంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

శ్రీ వాణి విక్రమ్ దంపతులు ఇద్దరూ కూడా బుల్లితెర నటినట్టుగా కొనసాగారు. అయితే ప్రస్తుతం శ్రీవాణి పలు సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అలాగే విక్రమ్ మీ కడుపునిండా అనే రెస్టారెంట్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరంతా తమకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Srivani) శ్రీవాణి విక్రమ్ వారి గురించి ఎన్నో రకాల విషయాలను తెలియచేశారు.

ఈ క్రమంలోనే యాంకర్ వీరిని ప్రశ్నిస్తూ యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. ఇంతకు యూట్యూబ్ ద్వారా ఇంత మొత్తంలో సంపాదిస్తున్నారు అనే ప్రశ్న ఎదురయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ యూట్యూబ్ సంపాదనని ఆధారాలతో సహా చూపిస్తున్నారు కదా మరి మీరు ఏ రేంజ్ లో ఆదాయం పొందుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీవాణి విక్రమ్ ఇద్దరు కూడా సమాధానం చెబుతూ తాము కొన్ని నెలలు యూట్యూబ్ ద్వారా 30 లక్షలకు పైగా ఆదాయం తీసుకున్నామని తెలియజేశారు.

మా గృహప్రవేశానికి సంబంధించిన వీడియో అలాగే పాప హాఫ్ సారీ ఫంక్షన్ వంటి వీడియోలకు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయని, ఇలా కొన్ని వీడియోస్ మంచి వ్యూస్ వచ్చినప్పుడు 30 లక్షలకు పైగా అమౌంట్ వచ్చింది అంటూ వీరు తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఏది ఏమైనా యూట్యూబ్ ద్వారా ఇలా లక్షల్లో ఆదాయం రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus