మన టాలీవుడ్ సమ్మర్ ను వేస్ట్ చేసుకొంది, సమ్మర్ హాలీడేస్ ను వినియోగించుకోలేకపోయింది అని బాధపడి ఇంకా వారం కూడా పూర్తవ్వకుండానే కట్టగట్టుకొని ఒకేసారి ప్రేక్షకుల మీద దాడికి దిగారు. ఒకవారంలో రెండు సినిమాలు విడుదలైతేనే ప్రేక్షకులకు చూడ్డానికి ఖాళీ లేని సమయంలో ఏకంగా 6 తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నారు మన దర్శకనిర్మాతలు. కాలేజీలు, స్కూల్స్ మొదలయ్యాయి.. స్టూడెంట్స్ తోపాటు పేరెంట్స్ కూడా వాటితో బిజీ అయిపోయారు. ఈ తరుణంలో ఈ శుక్రవారం ఏకంగా 6 తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా విడుదలవుతున్నాయి.
బయోపిక్ గా తెరకెక్కిన స్వచ్చమైన తెలంగాణ సినిమా “మల్లేశం”, కామెడీ స్పై థ్రిల్లర్ గా రూపొందిన “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫస్ట్ ర్యాంక్ రాజు”, మంచు విష్ణు నటించగా అప్పుడెప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిపోయి పలు వివాదాల అనంతరం ఎట్టకేలకు రేపు విడుడేయాలవుతున్న “ఓటర్” మరియు “గజేంద్రుడు, కెప్టెన్ రాణా ప్రతాప్” అనే మరో రెండు తెలుగు సినిమాలతోపాటు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ గా రూపొందిన “కబీర్ సింగ్” కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ఏ ఒక్కదానికి భారీస్థాయి ప్రారంభ వసూళ్లు వచ్చే అవకాశం లేదు కానీ.. ఆ తర్వాత వచ్చే టాక్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. మరి ఏ సినిమా ఆకట్టుకొంటుందో, ఏ సినిమా బోర్ కొట్టిస్తుందో చూడాలి.