సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో బిగ్ బడ్జెట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.
శకుంతల- దుష్యంతుల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ ఎంగేజింగ్ గా రూపొందించలేకపోయాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద చాలా బ్యాడ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది ఈ మూవీ. ఒకసారి ‘శాకుంతలం’ చిత్రం 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 1.03 cr |
సీడెడ్ | 0.26 cr |
ఉత్తరాంధ్ర | 0.37 cr |
ఈస్ట్ | 0.20 cr |
వెస్ట్ | 0.13 cr |
గుంటూరు | 0.16 cr |
కృష్ణా | 0.20 cr |
నెల్లూరు | 0.09 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.37 cr |
మిగిలిన భాషల్లో | 0.35 cr |
ఓవర్సీస్ | 1.00 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 4.16 cr |
‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.17.5 కోట్లు అని తెలుస్తుంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.03 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.13.34 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చాలా టఫ్ టార్గెట్.
పాన్ ఇండియా సినిమా అయ్యుండి రూ.10 కోట్ల గ్రాస్ ను కూడా రాబట్టలేకపోయిన మూవీగా ‘శాకుంతలం’ మిగిలిపోతుంది. రేపు ‘విరూపాక్ష’ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ‘శాకుంతలం’ కి ఇక కష్టమనే చెప్పాలి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!