Shaakuntalam Review: ‘శాకుంతలం’ ప్రీమియర్ షో రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..!

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్ ఇండియా చిత్రం `శాకుంత‌లం`. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్’ బ్యానర్ పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ‘గుణ టీమ్ వ‌ర్క్స్’ బ్యానర్‌ పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించడం విశేషం. దేవ్ మోహన్, మోహన్ బాబు,గౌతమి, అనన్య నాగళ్ళ.. వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదల కాబోతోంది.

అయితే ఈ చిత్రం పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్లో ఏమో కానీ.. నిన్నటి నుండి ప్రీమియర్ షోలు వేయడం మొదలుపెట్టారు.. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు. ఈ మధ్య కాలంలో ఇలా ప్రీమియర్ షోలు వేసి సినిమా పై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ కి ఇలాగే చేశారు. దీంతో ఆ సినిమా రిలీజ్ టైంకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అంతకు ముందు ‘బలగం’ చిత్రం విషయంలో కూడా దిల్ రాజు ఇదే ఫార్ములా అప్లై చేశారు.

ఇక నిన్న ‘శాకుంతలం’ ప్రీమియర్ షో చూసిన కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ షోకి మిక్స్డ్ టాక్ వస్తుండటం గమనార్హం. కొంతమంది ‘శాకుంతలం’ సినిమా చూసి బాగానే ఉంది, యావరేజ్ గా ఉంది అంటున్నారు. మరికొంతమంది అయితే సినిమా బాలేదు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసుకోవచ్చు.. అందులోనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అని వేశారు అంటూ చెప్పుకొస్తున్నారు.

సినిమాలో లెక్కలేనన్ని పాత్రలు ఉన్నప్పటికీ.. ఎవ్వరికీ కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే సమంత నటన, దేవ్ మోహన్ నటన, మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని కామన్ గా వినిపిస్తున్న టాక్. కాస్ట్యూమ్స్ కూడా అందరికీ బాగా సెట్ అయ్యాయని అంటున్నారు. రన్ టైం తక్కువ ఉండటం కూడా ఈ సినిమాకి ఓ ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus