ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై బాలీవుడ్ రెస్పాన్స్!

డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందరికీ వైద్య పరీక్షలు చేయించిన తరువాత కోర్టులో హాజరు పరిచారు. అయితే డ్రగ్స్ కేసు విషయంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్ కి మద్దతు ప్రకటించారు. అందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి పూజా భట్ కూడా ఉన్నారు.

‘చాహత్’లో బాద్ షా తో కలిసి పని చేసిన ఈ నటి ‘నేను మీకు సపోర్ట్ గా నిలుస్తున్నాను షారుఖ్. ఇది మీకు అవసరం లేకపోవచ్చు కానీ నేను చేస్తాను. ​ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అని సోషల్ మీడియా ట్వీట్ చేసింది. అంతేకాకుండా నటి సుచిత్ర కృష్ణమూర్తి కూడా షారుఖ్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘పిల్లలు ఇబ్బంది పాడడం చూడడం కంటే పెద్ద కష్టం తల్లితండ్రులకు ఏదీ ఉండదు. ఇంతకముందు కూడా ఇలానే బాలీవుడ్ నటులపై రైడ్స్ జరిగాయి. కానీ అందులో ఏం దొరకలేదు.

ఏదీ ప్రూవ్ కాలేదు. మాతో తమాషా చేయడం మామూలు అయిపోయింది కానీ అది మా ఫేమ్ ను దెబ్బ తీస్తుంది’ అని రాసుకొచ్చింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సైతం ఈ విషయంపై స్పందించారు. ఆర్యన్ చిన్నపిల్లాడిని.. అతడికి కొంచెం ఊపిరి ఆడనివ్వండి అంటూ కోరారు. నిజాలు బయటకు వచ్చేవరకు ఆగాలని చెప్పారు. ముంబై క్రూజ్ షిప్ పార్టీలో ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగించినందుకు గాను వివిధ సెక్షన్ల కింద ఎన్సీబీ ముగ్గురిపై కేసులు నమోదు చేసింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus