Jawan: జవాన్ సినిమాతో సరికొత్త రికార్డు అందుకున్న షారుక్!

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకొని ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ అట్లీ సోషల్ మీడియా వెనుకగా ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైనటువంటి మూడు వారాలకు గాను ఏకంగా రూ.1004.92 కోట్ల కలెక్షన్స్ ని అందుకుందని తెలియజేస్తూ ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా (Jawan) కలెక్షన్ల ద్వారా షారుక్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలందరూ కూడా 1000 కోట్ల మార్క్ దాటారు. అయితే షారుఖ్ ఖాన్ మాత్రం ఈ ఏడాదిలో వచ్చినటువంటి పఠాన్ సినిమా ద్వారా ఈ మార్క్ సాధించారు. ఇప్పుడు జవాన్ సినిమా ద్వారా కూడా ఈయన ఈ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్నారు. దీంతో ఇలా ఒకే ఏడాదిలోనే రెండు సినిమాలకు ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నటువంటి హీరోగా షారుక్ రికార్డు సృష్టించారు.

ఇక ఇదే ఏడాది షారుక్ ఖాన్ నటిస్తున్నటువంటి డుంకీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా వెయ్యి కోట్లను సాధిస్తే షారుక్ ఖాన్ రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరని చెప్పాలి. ఇలా తమ హీరో చాలా సంవత్సరాలు తర్వాత తెరపైకి వచ్చి ఈ స్థాయిలో ప్రేక్షకులను ఇలా సందడి చేస్తున్నటువంటి తరుణంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus