Shah Rukh Khan: సినిమా కథని తలపిస్తున్న షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు టాలీవుడ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ అయిన వారిలో షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. కాబట్టి.. ఇతను అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకుల్లో కూడా ఓ ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని పొందాడు. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నాడు ముంబై మొత్తం షారుఖ్ ఖాన్ ఇంటిముందు వాలిపోతుంది అంటే షారుఖ్ ఖాన్ పై జనాల్లో ఉన్న క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

ఇక షారుఖ్ ఖాన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా వరకు తెలిసిన పుస్తకమే అని చెప్పాలి. ఇతను గౌరీ ఖాన్ అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా అని వీరిది సింపుల్ లవ్ స్టోరీ కాదండోయ్. ఎంత స్టార్ అయినప్పటికీ షారుఖ్ ఖాన్ కూడా తన ప్రేమను గెలిపించుకోవడానికి సినిమా స్టైల్లోనే కష్టపడ్డాడు. దీనికి కారణం.. గౌరీ తల్లిదండ్రులు షారుఖ్ తో పెళ్లికి అంగీకరించకపోవడం వల్ల అని చెప్పాలి.ఈ విషయాన్ని గౌరీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

” షారుఖ్ (Shah Rukh Khan) తో పెళ్ళికి మా పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోలేదు. చాలా పట్టుబట్టి ఒత్తిడి తెస్తే వారు వివాహానికి అంగీకరించడం జరిగింది.మా పెళ్లి టైంకి షారూఖ్ వయసు 26, నా వయసు 21 సంవత్సరాలు. ఒకటి కాదు రెండు కాదు మేము 3 సార్లు వివాహం చేసుకున్నామంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది” అంటూ గౌరి తెలిపింది. ఢిల్లీలో కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో షారుఖ్ కు.. గౌరీతో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత అది ప్రేమగా మారింది.ముందుగా షారుఖ్.. గౌరీతో ప్రేమలో పడ్డాడు. 6 ఏళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది. షారుఖ్ ఖాన్ టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న రోజుల నుండి అతని భార్య గౌరీ అతనికి ఆర్ధికంగా అండగా నిలబడిందట. ఆ తర్వాత షారుఖ్ నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో అతను స్టార్ గా ఎదిగాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది తోడుంటుంది అనే మాటకు నేను గొప్ప ఉదాహరణ అని షారుఖ్.. మొహమాటం లేకుండానే ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఉంటాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus