హృతిక్ పై కోపంతోనే… కంగనా చిత్రంలో చేస్తున్నాడా..?

బాలీవుడ్ నటి కంగనాతో సినిమా చేయడానికి చాలా మంది వణికిపోతున్నారట. ఇటీవల క్రిష్ ను ఓ రేంజ్లో ఆదుకున్న సంగతి తెలిసిందే. ఇక తనతో సినిమా చేయలేదని కరణ్ జోహార్ పై కూడా… కరణ్ కి బంధుప్రీతి ఎక్కువని గతంలో ఆరోపణలు చేసింది. ఇక బాలీవుడ్ ఖాన్ లు అందరి పైనా కంగనా గతంలో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు ఖాన్ లలో ఒకరు .. కరణ్ కు అత్యంత సన్నిహితుడు అయిన షారూఖ్ .. కంగనాతో కలిసి నటించబోతున్నాడట.

ప్రస్తుతం కంగనా ‘మెంటల్ హై క్యా’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో షారూఖ్ ఓ ప్రత్యేక పాత్ర పోషించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ బాద్ షారూఖ్ క్యామియో రోల్ చేయడానికి కూడా ఓ రేంజ్ చూసుకునే చేస్తాడు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు షారూఖ్ హవా తగ్గింది. దీంతో కంగనా చిత్రంలో ఓ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడంట. గతంలో కంగనాతో ప్రేమాయణం సాగించి.. తర్వాత గొడవలతో దూరమైన హృతిక్ రోషన్‌ కి షారూఖ్ కి మధ్య వివాదాలు ఉన్నాయి. దీంతో హృతిక్ ని టీజ్ చేయడానికి షారూఖ్ ఈ చేస్తున్నాడని బాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ‘మెంటల్ హై క్యా’ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో ‘అనగనగా ఓ ధీరుడు’.. ‘సైజ్ జీరో’ వంటి చిత్రాలు తీసిన ప్రకాష్.. ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus