‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రం తర్వాత మళ్ళీ హిట్టందుకోలేకపోయాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ‘హ్యాపీ న్యూ ఇయర్’ నుండీ గతేడాది చివర్లో వచ్చిన ‘జీరో’ చిత్రం వరకూ అన్నీ ప్లాపులయ్యాయి. ఆఖరికి వరుస హిట్లతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ చిత్రంలో గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసినా హిట్టందుకోలేకపోయాడు. ఇప్పుడు షారుఖ్ ఇమేజ్ చాలా వరకూ డామేజ్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు షారుఖ్ పై చాలా ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం షారుఖ్ కథల విషయంలో చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే రాకేశ్ శర్మ బయోపిక్ ‘సారే జహాసే అచ్చా’ ను కూడా పక్కన పెట్టేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో షారుఖ్ ఓ తెలుగు దర్శకుడితో కలిసి పని చేయడానికి ఓకే చెప్పినట్లు తాజా సమాచారం.
వివరాల్లోకి వెళితే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్లో షారుఖ్ నటించబోతున్నాడట. ప్రకాష్ తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’, ‘సైజ్ జీరో’ వంటి చిత్రాలని తెరకెక్కించాడు. అయితే ఈ రెండూ సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ప్రకాష్ బాలీవుడ్ కు చెక్కేసి అక్కడా కంగనా, రాజ్ కుమార్ రావు లతో ‘మెంటల్ హై క్యా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో షారుఖ్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. కథలో తన పాత్రే కీలకం కబట్టి షారుఖ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మానసిక వికలాంగుల నేపధ్యంలో ఈ చిత్రంలో రూపొందుతుందట.