వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన షారుఖ్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో..!

బాలీవుడ్ బాద్‌షా, కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ కొంత కాలంగా సరైన కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.. ఇప్పుడు తన ఫోకస్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ దృష్టి అంతా ‘పఠాన్’ మూవీ పైనే ఉంది.. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండగా.. దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం కీలకపాత్రల్లో నటిస్తున్నారు.. ఇదిలా ఉంటే.. షారుఖ్.. జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శంచి.. ప్రత్యేక పూజలు జరిపించాడు..

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇటీవలే షారుఖ్ మక్కాను సందర్శించిన సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా స్థాయిలో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పఠాన్’ 2023 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.. కాగా ముస్లిం మతస్థులైన షారుఖ్, అమీర్ ఖాన్ హిందూ ఆలయాలను సందర్శించడం.. హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.. ఈమధ్యనే అమీర్.. తన కొత్త ఆఫీసు పూజా కార్యరక్రమంలో మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి పాల్గొన్నాడు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus