Jawan Twitter Review: ‘జవాన్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7న అంటే ఈరోజు హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా వెయ్యి కోట్లు పైనే వసూల్ చేసి అతనికి స్ట్రాంగ్ కంబ్యాక్ ను అందించిన సంగతి తెలిసిందే.

ఇక దర్శకుడు అట్లీ తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. అందుకే ‘జవాన్’ (Jawan) మూవీ పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించారు.టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉందని..

యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా కథని డామినేట్ చేశాయని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ పరంగా కొన్ని మంచి సన్నివేశాలు పడినా … గత 20 యేళ్ళుగా సౌత్ లో మగ్గిపోయిన మాస్ సినిమాలు అన్నీ గుర్తుకు వస్తాయని అంటున్నారు. మొత్తంగా యాక్షన్ స్టఫ్ ఎక్కువగా కంటెంట్ తక్కువగా ఉన్న ఈ సినిమా నార్త్ అభిమానులకు కొత్తగా అనిపించవచ్చు కానీ సౌత్ జనాలకి బోర్ కొట్టేలా ఉంటుంది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus