బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగు సంవత్సరాలు అవుతుంది. 2018లో జీరో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోకి ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది.ఇలా నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ జవాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ పాత్రలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అన్ని భాషలలో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
డిజిటల్ సాటిలైట్ హక్కులతో కలిపి ఈ సినిమా ఏకంగా 250 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.ఇలా డిజిటల్ సాటిలైట్ హక్కులు 250 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఇకపోతే నాలుగు సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.ఇప్పటికీ షారుక్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని జవాన్ నాన్ థియేట్రికల్ రైట్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది.
జీరో సినిమా ద్వారా మెప్పించ లేకపోయినా షారుక్ ఖాన్ జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి పోటి పడబోతున్నారు.మరి ఈ సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.