Shahrukh Khan: జవాన్ సినిమాపై స్పందించిన బన్నీ… స్పందించిన షారుక్!

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో నయనతార షారుఖ్ ఖాన్ జంటగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీ లందరూ కూడా ఈ సినిమా చూసిన అనంతరం సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇదివరకే మహేష్ బాబు జవాన్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే తాజాగా నటుడు అల్లు అర్జున్ సైతం జవాన్ సినిమా చూసి ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..షారుఖ్ మాస్ అవతార్ అని, మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు పొగిడేస్తూ రాసుకొచ్చాడు. అదేవిధంగా చిత్ర బృందంపై కూడా అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా అల్లు అర్జున్ జవాన్ సినిమా గురించి చేసిన ఈ ట్వీట్ కి షారుఖ్ (Shahrukh Khan) నుంచి రిప్లై వచ్చింది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ… స్వాగ్ విషయంలో పుష్ప ది ఫైరే నన్ను పొగుడుతుంది. ఈరోజు ఎప్పటికి మర్చిపోలేను. పుష్పని మూడుసార్లు చూసి ఉంటాను నేను. నిన్న పర్సనల్ గా కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ విధంగా షారుఖ్ ఖాన్ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పఠాన్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి షారుక్ ఖాన్ తిరిగి జవాన్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus