బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కొనసాగుతున్నటువంటి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్యన్ ఖాన్ ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఈయన డ్రగ్స్ వ్యవహారం కారణంగా సెలబ్రిటీ అయిపోయారు. అయితే షారుక్ ఖాన్ కుమారుడు తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారందరూ బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. షారుక్ తనయుడు ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే క్లోతింగ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.
ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డి యావోల్ ఎక్స్ పేరిట బ్రాండెడ్ బట్టలను విక్రయిస్తూ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అయితే ఈయన విక్రయిస్తున్నటువంటి ఈ బ్రాండెడ్ దుస్తుల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక టీ షర్ట్ కొనుగోలు చేయాలంటే దాదాపు 24 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక హుడీస్ అయితే 45 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. ఇక ఈయన విక్రయిస్తున్నటువంటి ఈ బ్రాండెడ్ దుస్తులలో ఒక లెదర్ జాకెట్ కొనాలి అంటే రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాలి.
ఈ విధంగా అత్యధిక ధరలతో ఈయన క్లోతింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పటికీ ఒక్క రోజుకే స్టాక్ మొత్తం పూర్తి అయిందని నెక్స్ట్ సేల్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఆర్యన్ ఖాన్ తెలియజేశారు. అయితే ఈయన విక్రయిస్తున్న బట్టల ధరలు ఈ రేంజ్ లో ఉండటంతో ఈయనపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
అన్న ఒక్క లెదర్ జాకెట్ మీ దగ్గర కొనాలి అంటే నేను కిడ్నీ అమ్ముకోవాల్సిందే అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నేను ఎందుకు దేవుడా ఇంత పేదవాడిగా పుట్టాను అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే నేను ఆ రెండు లక్షల జాకెట్ కొనాలి అంటే నా రెండు ఎకరాల పొలం కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అంటూ ఆర్యన్ ఖాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా