రిపబ్లిక్ డే కి ‘రాయీస్’..!

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాయీస్’. ఈ చిత్రం ఈద్ కు ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్నప్పటికీ.. సల్మాన్ ఖాన్ నటిస్తున్న సుల్తాన్ కూడా అదే రోజున విడుదల అవుతుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.

వచ్చే ఏడాది జనవరి లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు షారూఖ్, చిత్ర నిర్మాతలు రితేష్ శిద్వాని, ఫర్హాన్ అక్తర్ లు సంయుక్తంగా ప్రకటించారు. ‘ చిత్రాన్ని వాయిదా వేయటం అంత సులభమైన నిర్ణయం ఏమీ కాదు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2017 జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామ’ని వారు తెలిపారు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9 న విడుదల చేస్తారని ముందుగా అనుకున్నప్పటికీ అదే రోజున డిష్యూమ్, బార్ బార్ దేఖో చిత్రాలు విడుదల అవుతుండటంతో.. ఈ చిత్రాన్ని జనవరికి వాయిదా వేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus