బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకొని అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… వసుధారను తనతో పాటు కాలేజీకి తీసుకెళ్ళమని విశ్వం రీషికి చెప్పగా వసుధార మాత్రం తన క్లాసులో పది నిమిషాల పాటు కూర్చుని తాను ఎలా పాటలు చెబుతున్నాను వినాలని రిషిను రిక్వెస్ట్ చేస్తుంది. దానికి అతను ఒప్పుకోడు. అయితే నేను ఆటోలో వెళ్తానని చెప్పడంతో రిషి ఒప్పుకుంటాడు అయితే ఇదంతా కూడా వసుధార కల కంటుంది.
కారు తాళాలు తీసుకువచ్చిన రిషి వసుధార చేతిలో పెట్టి మీ పాటలు వినకపోతే ఆటోలో వెళ్తానని చెప్పారు కదా మీరు ఎందుకు నేనే వెళ్ళిపోతాను మీ మాటలు వినడమే కష్టంగా ఉంది అలాంటిది పాఠాలు ఎలా వింటానని రిషి వెళ్ళిపోతాడు కాలేజీలో రిషి ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటారు. వసుధార కొద్దిగా దూరంలో ఉండగా పాండ్యన్ బ్యాచ్ వసు మేడమ్ చెప్పిన ప్రాబ్లం చేయలేకపోయామని అనుకుంటూ తన దగ్గరకి వస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని వృత్తి ధర్మంలో వ్యక్తిగతం ఉండకూడదని చెప్పారని ఒక చిన్న కథ చెప్తుంది.
ఈ విషయం మాకెందుకు చెప్పారని పాండియన్ బిక్క మొహం వేస్తుంది అయితే అది చెప్పింది మీకు కాదు నాకు అనుకునే రిషి అక్కడి నుంచి లైబ్రరీకి వెళ్తారు. మరోవైపు బోర్డు మీటింగ్ కోసం అందరికీ ఇన్ఫర్మ్ చేసావా అని జగతి మహేంద్రను అడగడంతో ఇన్ఫామ్ చేశానని చెబుతారు. ఇక శైలేంద్ర అని చెప్పడంతో శైలేంద్రకు ఇన్ఫామ్ కూడా చేయలేదు. బోర్డు మీటింగ్లో తన పేరు కూడా తొలగించాలని చెబుతారు. అంతలోపు శైలేంద్ర నాకు తెలియకుండా బోర్డు మీటింగ్ఏర్పాటుచేసి ఏం ప్లాన్ చేస్తున్నారు అని అక్కడికి బయలుదేరుతారు
అయితే మనం విష్ కాలేజ్ కి మాత్రమే మిషన్ ఎడ్యుకేషన్ ఇచ్చామని చెబుతాను కానీ రిషి వసుధార పేరు మాత్రం ఎక్కడ వినిపించకూడదని జగతి మహీంద్రా మాట్లాడుకుంటారు. మరోవైపు లైబ్రరీలో వసుధార మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి అంతలోపు వసుధార కూడా లైబ్రరీ లోకి వస్తుంది. అయితే బుక్స్ ఉన్నటువంటి రాక్ తనపై పడిపోతూ ఉండగా వెంటనే వెళ్లి రిషితనని కాపాడుతారు. అనవసర విషయాల గురించి ఎక్కువగా మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతలోపు ఎంజల్ వస్తుంది ఏంజెల్ రిషి ని పలకరిస్తుంది.
వసుధారను బయటకు తీసుకెళ్తున్నామని చెబుతుంది. అయితే ఎక్కడికి ఏంటి అని అడగాలనుకుంటారు కానీ అడగకూడదని మనసులో అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ వెళ్తుంటే మాత్రం రీషి జాగ్రత్త అని జాగ్రత్తలు చెబుతాడు. మరోవైపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి ఉండగా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మనం మన కాలేజ్ కాకుండా విష్ కాలేజ్ కి హ్యాండవర్ చేస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అవుతారు. దీంతో శైలేంద్ర మీకు ఈ ప్రాజెక్టు పై ఆసక్తి తగ్గిపోయిందా ఎందుకు వాళ్లకి ఇస్తున్నారు అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తారు.
మేము అక్కడికి వెళ్ళాం అక్కడున్నటువంటి స్టాప్ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని భావిస్తున్నామని జగతి చెబుతుంది. మరి వారి పేర్లు ఏంటి అని శైలేంద్ర అడగడంతో మనకు పేర్లు అవసరం లేదు మన ప్రాజెక్ట్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడమే మనకు ముఖ్యమని జగతి చెబుతుంది. మీరు కచ్చితంగా వసుధార రిషికి ఈ ప్రాజెక్టు అప్ప చెబుతున్నారు అందుకే నాకు పేర్లు చెప్పలేదని మనసులో అనుకుంటారు.
ఇక మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి బాధ్యత నాదే అని సంతకాలు కూడా చేశారు. ఆ విషయం మర్చిపోయావా నీకు ఈ ప్రాజెక్టు అప్ప చెప్పినప్పుడు వేరే వాళ్ళకి హ్యాండవర్ చేయమన్నప్పుడే నీకు ఈ ప్రాజెక్టు పై ఆసక్తి లేదని తెలిసిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి బాధ్యత నాదే అంటూ జగతి మాట్లాడటంతో శైలేంద్ర షాక్ అవుతారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!