Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని భయపెట్టిన షకీల..! లైవ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. 5వారాల ఇమ్యూనిటీ కోసం హౌస్ మేట్స్ బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కొంతమంది హౌస్ మేట్స్ మాత్రం వాళ్లకి ఇమ్యూనిటీ అవసరం లేదన్నట్లుగానే ఉన్నారు. వీళ్లలో కిరణ్ రాథోడ్, షకీల ఇద్దరూ కూడా ముందుంటారు. అసలు వాళ్లకి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. అందుకే, షకీల జోకర్ పెయింటింగ్ ముఖానికి వేసుకుని చాలాసేపు పడుకుంది.

దీంతో బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) కన్ఫషన్ రూమ్ కి పిలిచి షకీలని పలకరించాడు. అక్కడే ఏమైనా హౌస్ లో గాసిప్స్ ఉంటే చెప్పమని అడిగాడు. దీంతో ప్రశాంత్, రతిక ఇద్దరి గురించి చెప్పింది షకీల. ఇక లైట్స్ ఆఫ్ చేసి అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి తన బెడ్ దగ్గరకి ఎవరో వస్తున్నారంటూ కేకలు వేస్తూ అరిచింది. హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. షకీలాకి దెయ్యం పట్టినట్లుగా కాసేపు ప్రవర్తించింది. వాళ్లని వెళ్లిపోమని చెప్పు అంటూ కేకలు వేసింది.

హౌస్ మేట్స్ కి భయమేసి దుప్పటి ముసుకులు పెట్టారు. థామినీ అయితే ఆంజనేయ దండకం చదివింది. దీంతో హౌస్ మేట్స్ కి భయమేసింది. శివాజీ మాత్రం షకీల బెడ్ దగ్గరకి వచ్చి తమిళంలో మాట్లాడుతూ సముదాయించాడు.అక్కడ ఎవరూ లేరని, నీ దగ్గరకి ఎవరూ రావట్లేదని చెప్పి నిద్రపుచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షకీల ఉన్నట్లుండి బెడ్ పై నుంచీ లేచి తమిళంలో మాట్లాడుతూ వాళ్లని ఎవరు అంటూ అడగడం, వెళ్లిపోమని కేకలు పెట్టడం చూసిన వాళ్లు కూడా ఇది సీక్రెట్ టాస్క్ లో భాగమేమో అని చెప్తున్నారు.

ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈవారం నామినేషన్స్ లో ఉన్న షకీల సేఫ్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈవీడియో వైరల్ అయ్యింది కాబట్టి, బిగ్ బాస్ టీమ్ ఈవారం షకీలని సేఫ్ చేస్తారనే అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, ప్రిన్స్ యవార్, కిరణ్ రాథోడ్ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉంటారు. వీళ్లలోనే మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus