Shakeela: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ను వెనకేసుకొచ్చిన షకీలా..!

ప్రస్తుతం బిగ్ బాస్ హవా నడుస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ‘బిగ్ బాస్ 7’ నడుస్తుంది. అక్కడి స్ట్రాంగ్ కంటెస్టెంట్ జోవికా గురించి కొద్దిరోజులుగా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈమె మరెవరో కాదు 3 పెళ్లిళ్లు చేసుకుని తమిళ నాట సెన్సేషన్ క్రియేట్ చేసిన వనిత విజయ్ కుమార్ కూతురు. అక్కడ ప్రస్తుతం జోవికా పేరు మార్మోగుతుంది. అందుకు ప్రధాన కారణం.. ఆమె హౌస్లో గేమ్ ఆడుతున్న తీరు అనే చెప్పాలి.

ఫిజికల్ టాస్క్ లు, మైండ్ గేమ్ లు.. ఇలా ఏది తీసుకున్నా జోవికా టాప్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా తాను అనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా ఈమె తగ్గడం లేదు. ఆ మనస్తత్వమే ఈమెకి బోలెడంత మంది ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అయితే హౌస్ లో ఉన్న ఈమె గేమ్ ను కంటెస్టెంట్లు అడ్డుకోలేకపోతుండటంతో.. వాళ్ళ పీఆర్ టీంలు జోవికా పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేసి ఆమెను బ్యాడ్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దాని వల్ల ఆమెకు ఓట్లు వేసే వారి సంఖ్య తగ్గిపోతుంది అనేది.. ఆ టీంల స్ట్రాటజీ కావచ్చు. ‘నీ తల్లి మూడు పెళ్లిళ్లు చేసుకుంది కాబట్టి.. నీ తండ్రి ఎవరు?’ అంటూ జోవికాని ట్యాగ్ చేస్తూ కొంతమంది దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.వనితా మొదటి భర్త ఆకాష్ .. జోవిక తండ్రి. అయితే వనిత రెండో భర్త.. ‘జోవికకి తండ్రి ఆకాష్ కాదు వనిత ప్రియుడు’ అంటూ గతంలో సంచలన కామెంట్లు చేశాడు. ఆ కామెంట్స్ ను ఇప్పుడు కావాలని కొంతమంది వైరల్ చేస్తున్నారు.

దీంతో తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ షకీలా.. జోవిక పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేస్తున్న వారిపై మండిపడింది. ‘జోవిక తండ్రి ఎవరో నాకు తెలుసు. ఆమెకు ఓ సోదరుడితో పాటు ఓ సోదరి కూడా ఉంది. జోవిక పుట్టిన సమయం కూడా నాకు తెలుసు. పక్క వాళ్ళ బెడ్ రూమ్లోకి తొంగి చూసే బ్యాచ్ ఇలాంటి తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. జోవిక తండ్రి ఆకాష్. ఆమెకు నామకరణం చేసే రోజు కూడా నేను అక్కడ ఉన్నాను. దయచేసి ఇలాంటి కామెంట్లు చేసే వారు ఆపండి’ అంటూ ఘాటుగా స్పందించింది (Shakeela)  షకీలా.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus