మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే?
- May 4, 2019 / 04:33 PM ISTByFilmy Focus
రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్ కృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రాజ్ తరుణ్ గతేడాది చేసిన మూడు చిత్రాలు ప్లాపవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దాని పై అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. మొదట మేఘ ఆకాష్ అన్నారు కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని పాండే ను ఫైనల్ చేసారని తాజా సమాచారం.
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
తాజాగా నిర్మాతలు ఈమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు షాలిని మే 16 నుండీ జాయినవ్వనుందని సమాచారం. ఈ సంవత్సరం ‘118’ చిత్రంతో హిట్టందుకుంది షాలినీ పాండే. ఇప్పుడు ఈ చిత్రంతో మరో హిట్టందుకోవడం ఖాయమని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి చిత్రాల్లో కూడా షాలిని ప్రత్యేక పాత్రలు పోషించింది. ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తుంది.












