కోలీవుడ్ లో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం విజయ్ సేతుపతి స్టైల్. భగ్న ప్రేమికుడిగా, ట్రాన్స్ జెండర్ గా, క్రూరమైన విలన్ గా ఇలా ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి నటిస్తుంటాడు. పాత్రలో కొత్తదనం ఉంటే చాలు పూర్తిగా తన ఎఫర్ట్స్ పెట్టి నటిస్తాడు. అందుకే ఆయనంటే ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. అయితే తాజాగా అతను అనౌన్స్ చేసిన కొత్త సినిమా మాత్రం తమిళ సినీ ప్రియులను విపరీతమైన ఆగ్రహానికి గురి చేస్తోంది.
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో రూపొందుతోన్న ‘800’ సినిమాలో విజయ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ లో ఎనిమిది వందల వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన మురళీధరన్ విషయంలో వ్యక్తిగతంగా ఎవరికీ ద్వేషం లేనప్పటికీ.. శ్రీలంకలో తమిళులను ఊచకోత కోసిన ఉదంతాలు, తమిళుల విషయంలో అక్కడ జరిగే అన్యాయాల నేపథ్యంలో శ్రీలంక దేశానికి చెందిన వ్యక్తి కథతో తమిళుడు సినిమా చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు అభిమానులు.
విజయ్ సేతుపతి శ్రీలంక జెర్సీ వేసుకోవడం, శ్రీలంక ఫ్లాగ్ ను మోయడానని తమిళ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఓ సినిమాలో నటించడానికి సిగ్గు లేదా అంటూ విజయ్ సేతుపతిపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో #ShameOnVijaySethupathi అనే హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం విజయ్ ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. నటుడిగా ఓ మంచి కథను ఎన్నుకొని సినిమా చేయడం తప్పా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ సేతుపతికి సపోర్ట్ ఎంతో అవసరం అంటూ పాజిటివ్ ట్వీట్లు చేస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!