Shani, Abhinaya shree: ఈవారం డబుల్ ఎలిమినేషన్ పక్కా..! ఎలిమినేట్ అయ్యింది వీళ్లే..!

  • September 17, 2022 / 10:47 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రెండోవారం పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి వారం ఎలిమినేష్ తీసేసి, రెండోవారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టేశాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారి షాక్ అయ్యారు. నిజానికి సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. నామినేషన్స్ లో మొత్తం 8మంది ఉంటే, వారిలో ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇందులో ఆదిరెడ్డి , గీతురాయల్, షానీ, అభినయశ్రీ ఇంకా రాజ్ శేఖర్ ఉన్నారు. రాజశేఖర్ కెప్టెన్ అయిన కారణంగా లాస్ట్ రెండురోజులు మంచి ఓటింగ్ ని కైవసం చేసుకుని ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇక అభినయశ్రీ పూర్తిగా ఆటలో వెనకబడింది. బేబీ బొమ్మల టాస్క్ లో తన బొమ్మని కాపాడుకోలేకపోయింది. దీంతో ఛాలెంజ్ ఎదుర్కోలేకపోయింది. ఒకవేళ ఏదైనా ఛాలెంజ్ గెలిచి ఉంటే కెప్టెన్ గా పోటీ పడి ఉండేది.

అప్పుడు డేంజర్ జోన్ నుంచీ బయటకి వచ్చేది. కానీ, ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉండిపోయింది. అలాగే, షానీ కూడా ఆటలో గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. వచ్చిన ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ని సరిగా టైమ్ కి పెట్టలేకపోయాడు. దీంతో ఓటింగ్ లో కూడా వెనకబడ్డాడు. అలాగే, ఆదిరెడ్డి కూడా టాస్క్ లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. బేబీ సిసింద్రీ టాస్క్ లో గీతు రాయల్ మాత్రం ఇరగదీసింది. ఈటాస్క్ లో తోటి హౌస్ మేట్స్ బొమ్మలని లాక్కుని వాళ్లని అవుట్ చేస్తూ ఆటలో దూసుకువెళ్లింది.

ఆదిరెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వల్ల కొద్దిగా బయటపడ్డాడు. ఆది – గీతు ఇద్దరూ సేఫ్ జోన్ లో ఉన్నారు. అలాగే, కెప్టెన్ రాజ్ కుమార్ కూడా సేఫ్ గానే ఉన్నట్లుగా సమాచారం. అయితే, అభినయశ్రీ ఇంకా రాజ్ వీరిద్దరిని బిగ్ బాస్ డబుల్ ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, మూడోవారం నాలుగోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందుకే రెండోవారమే డబుల్ ఎలిమినేషన్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా ఫస్ట్ వీక్ లో ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత అభినయశ్రీ దానిని ఉపయోగించుకోవాల్సింది. కానీ అభి కంప్లీట్ గా ఫెయిల్ అయ్యింది. ఇక రెండోవారం కూడా టాస్క్ లో వెనకబడింది. అలాగే, షానీ కూడా పెద్దగా పెర్ఫామన్స్ చూపించలేకపోయాడు. దీంతో వీరిద్దరూ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం.

రాజశేఖర్ , గీతురాయల్, ఆదిరెడ్డిలు డబుల్ ఎలిమినేషన్ ని తృటిలో తప్పించుకున్నారనే చెప్పాలి. తర్వాత రానున్నవారాల్లో కూడా ఇలా డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఇప్పటికే హౌస్ లో 19మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఇంకా వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరైనా వెళితే ఖచ్చితంగా డబుల్ , ట్రిబుల్ ఎలిమినేషన్స్ కూడా జరుగుతాయి. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus