Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

‘ఇండియన్ 2’ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో శంకర్ ఇచ్చిన షాకులు అలాంటివిలాంటివి కాదు. అప్పటివరకు శంకర్ తో సినిమా అంటే వెంటనే ఓకే చెప్పేసే హీరోలు.. ఇప్పుడు శంకర్ అంటే భయపడి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. శంకర్ తన ఇమేజ్ ని తిరిగి పొందాలంటే కచ్చితంగా ఓ భారీ హిట్టు కొట్టాలి. గతంలో ఓ పెద్ద సినిమా తీస్తే.. ‘బాయ్స్’ వంటి ప్రేమకథలు తీసి కన్సిస్టెన్సీని కొనసాగించిన శంకర్.. ఇప్పుడు మాత్రం పెద్ద ప్రాజెక్టులు తప్ప వేరేది చేస్తే చిన్నచూపు అని భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Shankar

పెద్ద సినిమాలు తీసి హైప్ రేపితే బిజినెస్ జరిగిపోతుంది. కానీ చిన్న, మిడ్ రేంజ్ సినిమా అంటే.. కంటెంట్ బలంగా ఉండాలి. శంకర్ ఇప్పుడు వెనుకబడిందే ఆ విషయంలో. తన ఆస్థాన రైటర్ సుజాత మరణించిన తర్వాత శంకర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ శంకర్ రియాలిటీలోకి రావడం లేదు.శంకర్ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘వేళ్పారి’ పై దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది.

తమిళంలో ప్రసిద్ధి చెందిన ఒక నవల ఆధారంగా ఓ మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా దీనిని తెరకెక్కించాలి అనేది శంకర్ ఆలోచన. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని ఆవిష్కరించాలి అని ప్లాన్ చేస్తున్నట్టు శంకర్ మొన్నామధ్య చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ డెవలప్ చేయడమే కాకుండా శివ కార్తికేయన్ వంటి స్టార్స్ ను అప్రోచ్ అయినట్టు కూడా తెలుస్తుంది.

హీరో మాత్రమే కాదు శంకర్ చాదస్తాన్ని తట్టుకునే నిర్మాత కూడా దొరకాలి కదా. ‘ఇండియన్ 3’ ని పక్కన పెట్టేసి ‘లైకా’ వారితో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలి అని శంకర్ భావించారు. కానీ ‘లైకా’ వారు అందుకు సిద్ధంగా లేరు. వారికి శంకర్ ‘ఇండియన్ 3’ ని పూర్తిచేసి ఇవ్వాలి. పోనీ అది పూర్తిచేద్దామనుకుంటే.. కమల్ హాసన్ ఆ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ ఫైనల్ గా ఏం డిసైడ్ అవుతారో చూడాలి.

‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus