స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిందేననే సంగతి తెలిసిందే. కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ లేకుండా శంకర్ తన డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఇండియన్2, చరణ్ హీరోగా ఒక సినిమా సెట్స్ పై ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఈ సినిమాల తర్వాత శంకర్ డైరెక్షన్ లో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే శంకర్ ను నమ్మి ఈ స్థాయిలో ఖర్చు పెట్టే నిర్మాతలు ఉన్నారా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లలో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కాలేదు. రోబో సినిమా తర్వాత ఆ రేంజ్ కథ, కథనం ఉన్న సినిమా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కలేదు.
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో పాటు నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయనే సంగతి తెలిసిందే. శంకర్ స్పందిస్తే మాత్రమే సూర్యతో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల బడ్జెట్ ఇప్పటివరకు 600 కోట్ల రూపాయలు దాటలేదు.
భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ ఎక్కువని శంకర్ మరీ భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. మరీ భారీ బడ్జెట్ సినిమాలు అంచనాలను అందుకోకపోతే ఆ సినిమాలపై పెట్టుబడులు పెట్టిన వాళ్లకు భారీ నష్టాలు తప్పవనే సంగతి తెలిసిందే.