Shanmukh, Siri: షణ్ముక్ కి విన్నర్ ఎవరో ముందే తెలిసిపోయిందా..?

బిగ్ బాస్ హౌస్ లో సిరికి షణ్ముక్ కి మాటల యుద్ధం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా సిరి చేస్తున్న పనులు షణ్ముక్ కి నచ్చడం లేదు. ముఖ్యంగా మానస్, కాజల్, సన్నీలతో దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. కాజల్ తో ఎక్కువగా ఎటాచ్ పెట్టుకోవద్దని అది నీ టాప్ 5 ప్లేస్ కి ఎసరు అవుతుందని చెప్తూనే ఉన్నాడు. ఇక టాస్క్ లో సన్నీ తనని ఇమిటేషన్ చేయడం నచ్చని షణ్ముక్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. సన్నీకి వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా మరో టాస్క్ లో సన్నీ షణ్ముక్ ని ఇమిటేషన్ చేస్తుంటే తట్టుకోలేకపోయాడు.

టాస్క్ ఆడట్లేదంటూ చెప్పండతో, సిరి వచ్చి కిచెన్ లో దోశలు వేస్తున్న షణ్ముక్ తో మాటలు కలిపి టాస్క్ ఆడమంటూ చెప్పింది. దీంతో నాకు తెలీదా.. అంటూ షణ్ముక్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు, సిరిపై మాటలు విసిరాడు. నీవల్లే నేను లోకువ అయిపోతున్నాను నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్ అంటూ చెప్పాడు. కాజల్ కూడా నామీద వాగుతుంది అంటూ రెచ్చిపోయాడు. గట్టిగట్టిగా అరుస్తూ సిరిపై ఫైర్ అయ్యాడు.అసలు షణ్ముక్ కి ఏమైంది ? ఎందుకింత ఫ్రస్టేషన్ లోకి వెళ్లిపోతున్నాడు అని చాలామందికి సందేహం కలుగుతోంది. అంతేకాదు, సిరితో షణ్ముక్ తన మనసులో మాటలన్నీ బయటకి చెప్పేశాడు.

నువ్వు ఎవరికో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటే నేను ఆపాను అని, అప్పడం అంటే నిన్ను డిపెండ్ చేశాను అని, మీ మదర్ వచ్చి అందరి ముందు హగ్ గురించి మాట్లాడింది. నేను నెగిటివ్ అవ్వట్లేదు ఇక్కడ, నేను నెగిటివ్ గా ఆలోచిస్తున్నా, అవతలోడి ముందు నేను తక్కువైనా పర్లేదు నేను నీకోసం ఫైట్ చేస్తున్నాను, అప్పుడు నేను నెగిటివ్ అవ్వలేదు. నీకు మాత్రం ప్రతిదీ నీకు నచ్చినట్లే అవుతోంది. అవతలోడి ఎమోషన్ నీకు గుర్తే ఉండదు. వెళ్లిపో నామటుకు నేను ఉన్నాను, మిగతా హౌస్ మేట్స్ ఎలాగో నాకు నువ్వు కూడా అంతే అంటూ విసురుగా పోట్లాడాడు.

ఇక ఇది చూసిన నెటిజన్స్ అందరూ షణ్ముక్ కి అసలు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే, విన్నర్ అవ్వడని ముందుగానే తెలిసిపోయిందని, ఆ ఫ్రస్టేషన్ ని సిరిపై చూపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, షణ్ముక్ సిరిని ఎందుకు అలా కంట్రోల్ చేయాలని చూస్తున్నాడో అర్ధం కావట్లేదని అంటున్నారు. ముందుగానే హౌస్ట్ నాగార్జున బ్రేకులు వేసి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus