Bigg Boss 5 Telugu: షణ్ముక్ ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేశాడా..?

బిగ్ బాస్ హౌస్ లో ఒక పక్క హౌస్ మేట్స్ అందరూ స్కిట్ లో బిజీగా ఉంటే, మరోపక్క షణ్ముక్ మాత్రం తన గేమ్ ని ఎనలైజ్ చేస్కుంటూ ఉన్నాడు. అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి స్కిట్ లో భాగంగా పెళ్లిళ్ల బ్రోకర్ పాత్రని పోషిస్తున్న షణ్ముక్ టీనేజ్ అబ్బాయి పాత్రలో ఉన్న జెస్సీకి బాగా కనెక్ట్ అయ్యాడు. వీరిద్దరూ లోబోతో కలిసి మంచి ఫన్ ని జనరేట్ చేశారు. ముఖ్యంగా శ్వేత – లోబో – రవి – షణ్ముక్ ల కామెడీ ఈ స్కిట్ లో హైలెట్ అని చెప్పాలి. ఇక్కడే మద్యమద్యలో వచ్చిన గ్యాప్స్ లో షణ్ముక్ జెస్సీతో తన మనసులో మాటల్ని బయటపెట్టాడు.

సిరి బాగా పెర్ఫామెన్స్ చేస్తుందని అనుకున్నాను అని, ఎంతో ఎక్స్ పెక్ట్ చేశానని కానీ సేఫ్ గేమ్ ఆడుతోందని చెప్పాడు షణ్ముక్. ఇక నుంచీ బెడ్ కూడా దూరం పెట్టాలని జెస్సీతో మాట్లాడాడు. జెస్సీ కూడా సిరి బ్యూటిఫుల్ కానీ బ్లైయిన్ లెస్ అంటూ అభిప్రాయ పడ్డాడు. ఇక్కడ షణ్ముక్ మాట్లాడుతూ దూరం పెట్టాలని , తనతో పాటు ఉంటే మన సపోర్ట్ ఇండైరెక్ట్ గా వేరేవాళ్లకి కూడా వెళ్లిపోతుందని చెప్పాడు. అందుకే బెడ్ ఛేంజ్ చేస్కుందాం అంటున్నా అంటూ జెస్సీతో చెప్పాడు.

ఇక్కడితో ఖచ్చితంగా సిరిని షణ్ముక్ దూరం పెడతాడనే అనిపిస్తోంది. జెస్సీ నేను చెప్పి చూశాను కానీ ఉపయోగం లేదు అని చెప్పాడు. సిరి సేఫ్ గేమ్ ఆడుతోందని, తన యూనిక్ ని మిస్ అవుతోందని చెప్పాడు షణ్ముక్. నేను అనవసరంగా ఎక్కువ అంచనా వేసి తప్పుచేశానేమో అంటూ చెప్పాడు. దీన్ని బట్టీ చూస్తే షణ్ముక్ ఈ స్కిట్ తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తున్నాడా అని అయితే ఖచ్చితంగా అనిపిస్తోంది. అంతేకాదు, స్కిట్ చేస్తున్నప్పుడు వాడెవడు నాకు చెప్పడానికి వాళ్లిద్దరూ పెద్ద యాక్టర్లా అని కూడా ఫైర్ అయ్యాడు. మరి వాళ్లిద్దరూ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus