యూట్యూబ్ స్టార్ గా పేరొందిన షణ్ముఖ్ జశ్వంత్ ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్నాడు. ‘బిగ్‌బాస్ -5’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్…కు సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అతను నామినేషన్స్ లో ఉంటే కనుక భారీ ఓటింగ్ నమోదవుతుంది. దీని వెనుక దీప్తి సునైనా ఉందన్నది బహిరంగ రహస్యమే. వీళ్ళిద్దరూ ఎప్పటి నుండో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకుని ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
షణ్ముఖ్‌ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయాలని బయట శతవిధాల ప్రయత్నిస్తుంది దీప్తి సునైనా.అయితే వీళ్ళ పెళ్ళి ప్రస్తావన షణ్ముఖ్ తల్లి ఉమారాణి వద్దకి తీసుకెళ్తే ఆమె షాక్ అయ్యింది. షణ్ముఖ్ తల్లి ఉమారాణి మాట్లాడుతూ.. “నాకు తెలిసి షణ్ముఖ్, దీప్తిలు ఫ్రెండ్స్ మాత్రమే..! వాళ్ళిద్దరూ కలిసి చేసిన సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలా వాళ్ళది మంచి జోడి అని అందరూ అంటుంటారు.ఒకవేళ వాళ్లిద్దరికీ నిజంగా ఒకరంటే ఒకరు ఇష్టం అయితే వాళ్ళకి పెళ్ళి చేయడానికి మాకేమి అభ్యంతరం లేదు.
అయినప్పటికీ ఇద్దరి కుటుంబసభ్యులని సంప్రదించి తగినట్టుగా చేయాలి. ఇంకా వాళ్ళది చిన్న వయసే, కాబట్టి అప్పుడే తొందరపడనవసరం లేదు. దీప్తితో ప్రేమ, పెళ్ళి విషయాల గురించి షణ్ముఖ్ ఎప్పుడూ మా వద్ద చర్చించలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఉమారాణి ఇలా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం పై దీప్తి- షణ్ముఖ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?