Sharmila: షర్మిల కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా.. ఏం జరిగిందంటే?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ సన్నిహితులు, బంధువులు కడపలో రాజకీయాలు చేస్తూ సత్తా చాటుకున్నారు. వైసీపీ నేతలలో కొంతమందికి సినీ రంగంతో మంచి సంబంధాలు ఉన్నా పూర్తిస్థాయిలో సినీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ నేతల సంఖ్య చాలా తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. వైసీపీ ప్రస్తుతం ఏపీలో మాత్రమే రాజకీయాలు చేస్తోంది. అయితే షర్మిల వైఎస్సార్టీపీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తన మార్కును సృష్టించాలని భావిస్తున్నారు.

అయితే తెలంగాణలో ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలు బలంగా ఉండటంతో షర్మిల పార్టీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. షర్మిల మినహా బలమైన నేతలెవరూ పార్టీలో లేకపోవడం కూడా వైఎస్సార్టీపీకి మైనస్ అవుతోంది. అయితే తాజాగా షర్మిల, ఆమె కొడుకుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. షర్మిల కొడుకు రాజారెడ్డి ఫోటోలను చూసిన నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. రాజారెడ్డిలో హీరోకు అవసరమైన లక్షణాలు అన్నీ ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే సులువుగానే స్టార్ స్టేటస్ సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉండటంతో రాజారెడ్డి ఆలోచన ఎలా ఉందో తెలియాల్సి ఉంది. రాజారెడ్డి రాజకీయాలపై దృష్టి పెడతారో లేక సినిమాలపై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది. ఏ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే రాజారెడ్డికి కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు షర్మిల (Sharmila) 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో తెలియాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. అధికారంలో ఉన్న పార్టీలపై ప్రతిపక్ష పార్టీల నుంచి ఘాటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus