తేడా వస్తే కష్టమే శర్వా…!

టాలీవుడ్ లో ఓ చిత్రం సూపర్ హిట్టయ్యిందంటే.. అదే ఫార్మాట్ తో మరో 10 సినిమాలైనా వచ్చేస్తాయి. గతంలో కూడా శ్రీను వైట్ల ‘ఢీ’ చిత్రాన్ని బేస్ చేసుకుని ఓ పది సినిమాలైనా వచ్చి ఉంటాయి. ఇందులో శ్రీనువైట్లనే చాలా వరకూ రిపీట్ చేసాడు ఇక మిగిలిన దర్శకులు కూడా ఫార్మాట్ ను ఫాలో అవ్వడంతో శ్రీనువైట్ల ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక అటుతరువాత ‘మగధీర’ ఫార్మాట్ తో ‘శక్తి’ ‘బద్రీనాథ్’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇవి ‘మగధీర’ కి స్పూఫ్ లు లా మిగిలిపోయాయి. ఇప్పుడు ‘మ‌హ‌ర్షి’ కూడా టాలీవుడ్ ను ఆకర్షించింది. నిజానికి ఈ చిత్రం కూడా మూడు, నాలుగు చిత్రాలు కలిపినట్టే ఉంటుంది… కానీ డైరెక్టర్ చెప్పాలనుకున్న సోష‌ల్ ఎలిమెంట్‌ అందరికీ చేరువయ్యేలా చెప్పడం ప్రేక్షకులకి నచ్చింది.

అయితే శ‌ర్వానంద్ కూడా ‘మహర్షి’ లానే ఓ చిత్రం చేస్తున్నాడట. ‘ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రంతో కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యమవుతున్నాడు. ఓ మిలియ‌నీర్ వ్య‌వ‌సాయ‌దారుడుగా మార‌డ‌మే ఈ చిత్ర క‌థాంశమని తెలుస్తుంది. పాయింట్ ఒకేలా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్ డిఫరెంట్ గా ఉంటాయంట. సినిమా బాగుంటే ఓకే … కానీ ప్లాప్ అయ్యిందంటే మాత్రం ‘మ‌హ‌ర్షి’ ని చూసి వాత‌లు పెట్టుకున్నట్టే అవుతుంది. మరి శర్వా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus