Sharwanand, Prabhas: టైమ్ ట్రావెల్ ను నమ్ముకుంటున్న శర్వా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే శర్వానంద్ భవిష్యత్తు సినిమా కూడా టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకక్కనుందని వార్తలు వస్తుండటం గమనార్హం. సాధారణంగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ కథలతో పోలిస్తే శర్వానంద్ సినిమా భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం. శర్వానంద్, అతని ఫ్రెండ్స్ బాల్యంలోకి వెళతారని స్టూడెంట్ డేస్ ఎలా గడిచాయో గమనిస్తారని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఈ హీరోకు షాకిస్తున్నాయి. మిగతా హీరోలు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటుంటే వరుస ఫ్లాపుల వల్ల శర్వానంద్ మార్కెట్ పై కూడా ప్రభావం పడుతోంది. శర్వానంద్ గత సినిమా శ్రీకారంకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. టైమ్ ట్రావెల్ కథతో డిఫరెంట్ పాయింట్ ను ఎంచుకున్న శర్వానంద్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శర్వానంద్ ఒక్కో సినిమాకు 6 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. శర్వానంద్ ఫ్యామిలీ కథాంశాలను ఎక్కువగా ఎంచుకుంటుండగా ఆ కథలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు. కథల విషయంలో శర్వానంద్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus