ఈసారి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేలానే ఉన్నాడుగా..!

  • July 3, 2020 / 06:20 PM IST

‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ వంటి డిజాస్టర్లను మూటకట్టుకుని రేస్ లో వెనుక పడ్డాడు శర్వానంద్. చెప్పాలంటే శర్వానంద్ సినిమా అనగానే మినిమం గ్యారెంటీ అని అంతా అనుకుంటారు. కానీ గత 3 సినిమాలు ఆ నమ్మకం పై నీళ్ళు జల్లాయి అనే చెప్పాలి. అలా అని శర్వానంద్ డిజప్పాయింట్ అయినట్టు కనిపించడం లేదు. మంచి సబ్జెక్టు లు సెలెక్ట్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

అవును ఇప్పుడు శర్వానంద్ లైనప్ చూస్తుంటే.. ఎవ్వరికైనా అదే ఫీలింగ్ కలుగక మానదు. ప్రస్తుతం శర్వానంద్ 3 ప్రాజెక్ట్ లు లైన్లో పెట్టినట్టు సమాచారం. రిలీజ్ కావాల్సిన ‘శ్రీకారం’ చిత్రం కాకుండా ఈ 3 ప్రాజెక్టులు అన్న మాట. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తో ‘మహాసముద్రం’ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు శర్వానంద్. ‘ఏ.కె.ఎంటెర్టైన్మెంట్స్’ సంస్థ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో హీరో సిద్దార్థ్ కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది.

దీని తరువాత.. శ్రీరామ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న చిత్రంలో కూడా శర్వానంద్ నటించబోతున్నాడట. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని వినికిడి. వీటి తరువాత రాంచరణ్ నిర్మాణంలో ఓ సినిమా.. అలాగే మహేష్ బాబు నిర్మాణంలో ఓ సినిమా చెయ్యడానికి కూడా శర్వానంద్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం వాటికి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus