Sharwanand: మరికొద్ది రోజులలో పెళ్లి… ప్రమాదానికి గురైన శర్వానంద్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో శర్వానంద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కార్ ఫిలింనగర్ జంక్షన్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. అయితే కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. ఇక ఈయన కారు ప్రమాదానికి గురైన విషయం గమనించిన స్థానికులు శర్వానంద్ ను హాస్పిటల్ కి తరలించారు. ఇలా శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈయనకు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది కానీ (Sharwanand) శర్వానంద్ రోడ్డు ప్రమాదంపై కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. అయితే ఈయన ప్రమాదానికి గురైనటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శర్వానంద్ జూన్ రెండవ తేదీ ,మూడో తేదీన ఆయన వివాహం జరగనుంది. ఇలా వివాహం దగ్గర ఉండగా శర్వానంద్ ప్రమాదానికి గురవడంతో అందరూ ఆందోళన చెందారు. ఈయన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక వీరి వివాహం జైపూర్ లోని శ్రీ లీలా ప్యాలెస్ లో జరగబోతుంది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులలో పెళ్లి ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక వీరి వివాహం చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలో హీరో ఇలా ప్రమాదానికి గురి కావడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ గాయాల నుంచి శర్వానంద్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus