శర్వానంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’. శివరాత్రి కానుకగా మార్చిలో ఈ చిత్రం విడుదలయ్యింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చెయ్యలేకపోయింది. కిషోర్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.. ‘శ్రీకారం’ ను నిర్మించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘శ్రీకారం’ నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు పంపాడట.
వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి గాను శర్వానంద్ కు నిర్మాతలు రూ.6 కోట్లు పారితోషికం ఇవ్వాల్సి ఉందట. అయితే రిలీజ్ కు ముందు రూ.4 కోట్లు చెల్లించి.. బ్యాలెన్స్ రూ.2 కోట్లు తమ వద్ద ఉంచుకున్నారట నిర్మాతలు. ‘శ్రీకారం’ రిలీజ్ అయ్యాక బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారులే అని లైట్ తీసుకున్న శర్వానంద్ కు.. నిర్మాతల సైడ్ నుండీ రెస్పాన్స్ రాలేదట. దాంతో వాళ్లకు ఈ విషయం గుర్తుచేసాడట. ఆ టైం లో వాళ్ళు రూ.50 లక్షలు చెల్లించారట.
బ్యాలెన్స్ రూ.1.5 కోట్లు ఇప్పటి వరకూ చెల్లించలేదని తెలుస్తుంది. దీంతో సహనం కోల్పోయిన శర్వానంద్.. నిర్మాతలకు నోటీసులు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఈ విషయం పై నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక శర్వానంద్ ప్రస్తుతం ‘మహాసముద్రం’, ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వీటి షూటింగ్ వాయిదా పడింది.