Sharwanand: కెరీర్ విషయంలో శర్వానంద్ నిర్ణయం రైటైనా?

  • November 4, 2022 / 08:48 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన శర్వానంద్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. ఈ ఏడాది శర్వానంద్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు నెగిటివ్ టాక్ రావడం వల్ల ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు. ఒకే ఒక జీవితం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

అయితే శర్వానంద్ తర్వాత ప్రాజెక్ట్ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. కెరీర్ లో సరైన సక్సెస్ లేని శర్వానంద్ తర్వాత ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా కొత్త డైరెక్టర్ ను ఎంచుకోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శర్వానంద్ కెరీర్ రిస్క్ లో ఉందని కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తే శర్వా కెరీర్ మరింత రిస్క్ లో పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శర్వానంద్ రెమ్యునరేషన్ సైతం గతంతో పోల్చి చూస్తే తగ్గిందని బోగట్టా.

ఒక్కో సినిమాకు కేవలం 8 కోట్ల రూపాయల రేంజ్ లో శర్వానంద్ రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా శర్వానంద్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. శర్వానంద్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో మారాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

శర్వానంద్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శర్వానంద్ కు సక్సెస్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాల్సి ఉంది. గతంలో సక్సెస్ ఇచ్చిన దర్శకులకు శర్వానంద్ ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది చెబుతున్నారు. శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. శర్వానంద్ కచ్చితంగా సక్సెస్ సాధించే ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus