తొలినాళ్లలో దర్శక నిర్మాతలతో బాగానే ఉన్న మీడియం రేంజ్ హీరోలు.. కాస్త మార్కెట్ పెరిగిన వెంటనే నిర్మాతల నెత్తినెక్కి కూర్చుంటున్నారు అనే వదంతులు ఇప్పుడు జోరందుకున్నాయి. మొన్నటి వరకూ ఈ లిస్ట్ లో రవితేజ పేరు ఎక్కువ వినిపించింది. 10 కోట్లకు లెక్క తగ్గితే సినిమా చెయ్యనంటున్నాడు అంటూ ఫిలింనగర్ లో పెద్ద డిస్కషన్లు జరిగాయి. ఓ కుర్ర డైరెక్టర్ సైతం ‘చీప్ స్టార్’ అంటూ పరోక్షంగా ట్వీట్ చేసే వరకూ వెళ్ళింది వ్యవహారం. మరోపక్క వరుస డిజాస్టర్ లు కూడా పడటంతో రవితేజ తగ్గదని ఈ మధ్య మళ్ళీ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు శర్వానంద్ కూడా రవితేజ లానే ప్రవర్తిస్తున్నదంటూ వార్తలు జోరందుకున్నాయి.
శర్వానంద్ సినిమాల కథల విషయంలో మంచి టెస్ట్ గల హీరో అనే ముద్ర.. ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ, యూత్ లోనూ బలంగా ఉంది. 20 కోట్లకు థియేట్రికల్ విషయంలో తగ్గని మార్కెట్ ఉంది కాబట్టి… శర్వాతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకి 7 కోట్ల రెమ్యూనరేషన్ చెబుతున్నాడట శర్వా. దాంతో ఈయన్ని వెతుక్కుంటూ వచ్చిన దర్శక నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. ‘అసలే మూడు డిజాస్టర్ లు పడ్డాయి.. ఈ టైములో ఇలా డిమాండ్ చేస్తే ఎలా’.. అనే కామెంట్స్ శర్వా పై పడుతున్నాయి.