శర్వానంద్ ‘మహానుభావుడు’ తర్వాత 3 డిజాస్టర్ లు మూటకట్టుకున్నాడు. గతే నెల విడుదలైన ’96’ రీమేక్ ‘జాను’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.. శర్వా నటనకి కూడా ప్రశంసలు దక్కాయి కానీ.. అప్పటికే ’96’ చిత్రాన్ని అందరూ చూసెయ్యడం.. అలాగే మల్టీ ప్లెక్స్ ఆడియన్సును తప్ప.. ఆ చిత్రం మాస్ ప్రేక్షకులకు ఏమాత్రం మెప్పించలేకపోయింది. సమంత స్టార్ డం.. దిల్ రాజు బ్రాండ్ కూడా ఆ చిత్రాన్ని కాపాడలేకపోయాయి. ఇక ఫిబ్రవరి అన్ సీజన్ కావడంతో కలెక్షన్లు కూడా రాలేదు. దీంతో పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఆ చిత్రం. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే శర్వానంద్ భుజానికి గాయమాయిన సంగతి తెలిసిందే.
అప్పుడు అతని భుజానికి సర్జరీ అవసరమని వైద్యులు చెప్పినప్పటికీ.. శర్వా లైట్ తీసుకున్నాడట. ‘జాను’ అలాగే తన తదుపరి చిత్రం ‘శ్రీకారం’ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటూ.. పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడట. మొత్తానికి ఇప్పుడు అమెరికా వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడని సమాచారం. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి వస్తాడని శర్వా సన్నితుల నుండీ సమాచారం. ఇక తన ‘శ్రీకారం’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.