Shekar Basha: ఆ ముగ్గురూ ఫేక్.. కుండ బద్దలుగొట్టేసిన శేఖర్ భాషా.!

‘బిగ్ బాస్ 8’ సక్సెస్ ఫుల్గా 2 వారాలు పూర్తయింది. వీక్ డేస్ లో హౌస్మేట్స్ మధ్య ఉండే గొడవలు.. వీకెండ్ లో ఎక్కువగా కనిపించవు. ముఖ్యంగా సండే.. అంటే ఫన్ డే. ఆ రోజుకి నామినేషన్స్ లో ఉన్నవాళ్లు బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నప్పటికీ.. వారితో ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ ఉంటాడు హోస్ట్. చివర్లో కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. హౌస్మేట్స్ కి మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా..! ఎందుకంటే అప్పటివరకు హౌస్లో ఉన్న కంటెస్టెంట్ ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి..! సరే నిన్న శేఖర్ భాషా (Shekar Basha) ఎలిమినేట్ అయ్యాడు.

Shekar Basha

వాస్తవానికి అతనికి తక్కువ ఓట్లు అయితే రాలేదు.హౌస్లో ఇంకొన్ని రోజులు ఉండటానికి అతను అర్హుడు కూడా..! అతనిపై ఆడియన్స్ నుండి పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. అయినప్పటికీ అతను ఎలిమినేట్ అయ్యాడు. అది కేవలం అతని భార్యకి డెలివరీ అవ్వడం వల్లనే..! అవును శేఖర్ భాషా భార్యకి డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని.. హౌస్లో ఉన్నప్పుడు శేఖర్ భాషా చెప్పి ఆనందంలో ముంచెత్తిన హోస్ట్ నాగార్జున (Nagarjuna) .. తర్వాత ఎలిమినేట్ చేసి కొంతమందిని ఏడిపించాడు. ఇది కేవలం శేఖర్ భాషా (Shekar Basha) పర్సనల్ లైఫ్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ఎలిమినేషన్ మాదిరే ఉంది.

అయితే హౌస్లో నుండి స్టేజి పైకి వచ్చిన శేఖర్ భాషాతో ఓ గేమ్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. అదేంటంటే.. హౌస్‌లో ఉన్న ముగ్గురు ఫేక్, అలాగే ముగ్గురు రియల్ పర్సన్స్ గురించి శేఖర్ భాషా చెప్పాలి. ఓ బోర్డుపై రియల్, ఫేక్ అని ఉన్న చోట శేఖర్ భాషా అభిప్రాయం వ్యక్తపరచాలి. ఈ క్రమంలో.. రియల్ అన్న చోట సీత (Kirrak Seetha)   , విష్ణుప్రియ (Vishnu Priya) , ప్రేరణ (Prerana) ఫోటోలు పెట్టాడు శేఖర్ భాషా. వీళ్లలో…. సీత ది రియల్ పర్సన్, విష్ణుప్రియ అమాయకురాలు,ప్రేరణను కొన్ని విషయాల్లో వ్యతిరేకించినప్పటికీ జెన్యూన్ పర్సన్ అంటూ శేఖర్ భాషా చెప్పుకొచ్చాడు.

 

తర్వాత ఫేక్ పర్సన్స్ లిస్ట్ లో సోనియా,మణికంఠ  (Naga Manikanta) , ఆదిత్య ఓం పేర్లు చెప్పాడు.ముఖ్యంగా సోనియా.. ‘నవ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది.కానీ ఆ నవ్వుతో మాయ చేసేస్తుంది. క్షణాల్లో ఆమె ఫేస్ ఛేంజ్ చేసేస్తుంది.ఆమెలో ఇద్దరుంటారు’ అంటూ కుండబద్దలుగొట్టేసాడు శేఖర్ భాషా.తర్వాత మణికంఠ ఎమోషన్స్‌ను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అని చెప్పాడు. ఇక ఆదిత్య ఓం ‘ఫ్రెండ్ గా ఉండి మరీ నన్ను రెండు, మూడు సార్లు నామినేట్ చేశాడు.. కానీ నేను ఒక్కసారి నామినేట్ చేస్తే తట్టుకోలేకపోయాడు’ అంటూ ఓపెన్ అయిపోయాడు శేఖర్ భాషా(Shekar Basha).

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన శేఖర్ బాషా!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus