సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ప్రముఖ మోడల్, నటి షెర్లిన్ చోప్రా రివర్స్ ఎటాక్ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులు జైల్లో ఉన్న ఆయన రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చారు. నటి షెర్లిన్ తమ పరువుకు నష్టం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతులు ఆమెపై రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో షెర్లిన్ రివర్స్ లో శిల్పాశెట్టి దంపతులపై ఎదురుదాడికి దిగింది. తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75 కోట్లు అడుగుతూ తానే తిరిగి శిల్పాశెట్టి దంపతులకు నోటీసులు పంపించినట్లు షెర్లిన్ తెలిపింది. రాజ్‌కుంద్రా తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఏప్రిల్‌లో షెర్లిన్ ఫిర్యాదు చేసింది. ఇదే విషయమిది రీసెంట్ గా ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగిస్తోందని..
రాజ్‌కుంద్రాతో పాటు శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు షెర్లిన్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో షెర్లిన్.. శిల్పాశెట్టి దంపతులపై ఆరోపణలు చేస్తుంది. తనపై అండర్ వరల్డ్‌తో బెదిరింపులకు పాల్పడ్డారని.. ఇప్పుడు పరువునష్టం నోటీసులు కూడా ఇచ్చారని, కానీ ఇలాంటి వాటికి భయపడేదే లేదని అన్నారు. తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు నష్టం పరిహారం చెల్లించాలని నోటీసులు పంపినట్టు వెల్లడించారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?