రాజ్ కుంద్రాని నమ్మి మోసపోయా : షెర్లిన్ చోప్రా

  • August 8, 2021 / 04:18 AM IST

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా చాలా మందిని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో శుక్రవారం నాడు నటి షెర్లిన్ చోప్రాను ఎనిమిది గంటల పాటు విచారించారు. ఆ తరువాత ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఏడ్చేసింది ఈ బ్యూటీ. ఇలాంటి కేసులో భాగమవుతానని అసలు ఊహించలేదని.. రాజ్ కుంద్రాను తొలిసారి కలిసినప్పుడు జీవితమే మారిపోతుందని అనుకున్నానని.. కానీ ఇలా పోర్నోగ్రఫీ కేసులో భాగమయ్యానంటూ ఎమోషనల్ అయింది.

శిల్పాశెట్టి భర్త కాబట్టి తనతో తప్పుడు పనులు చేయిస్తాడని అనుకోలేదని చెప్పింది. ఆర్మ్స్ ప్రైమ్ తో ఒప్పందం కుదిరాక తనతో మొదటి గ్లామర్ వీడియోలు చేయించారని.. ఆ తరువాత అవి బోల్డ్ చిత్రాలుగా మారాయని.. ఆ తరువాత అర్ధ నగ్నంగా, పూర్తి నగ్నంగా వీడియోలు చేయించినట్లు చెప్పింది. ఇది కూడా గ్లామర్ వీడియోల్లో భాగమేనని తనను కన్విన్స్ చేసినట్లు గుర్తుచేసుకుంది. అంతేకాకుండా శిల్పాశెట్టికి తన వీడియోలు, ఫోటోలు నచ్చాయని అబద్ధాలు చెప్పారని.. రాజ్ కుంద్రా మాటలు నమ్మి మోసపోయానని చెప్పుకొచ్చింది షెర్లిన్ చోప్రా.

శిల్పాశెట్టి లాంటి వాళ్లు మెచ్చుకున్నారంటే మనం చేస్తోంది తప్పో, ఒప్పో కూడా అర్ధం చేసుకునే స్థితిలో ఉండమని తెలిపింది. తను శిల్పాశెట్టికి, రాజ్ కుంద్రాకు వ్యతిరేకం కాదని.. పోర్నోగ్రఫీ రాకెట్ కు మాత్రం వ్యతిరేకిని అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో వ్యక్తులు స్వార్ధపరులని.. డబ్బు కోసం ఇతరులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారని.. ఫ్యూచర్ లో తన పిల్లలను మాత్రం ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనివ్వనని చెబుతూ ఏడ్చేసింది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus