నటి మెడపై టాటూ.. ఫోటో వైరల్!

నటి, గాయని శిబానీ దండేకర్ కొత్త టాటూ వేయించుకున్నారు. బాయ్ ఫ్రెండ్ ఫర్హానాన్ అక్తర్ పేరుని ఆమె మెడ మీద పచ్చబొట్టు వేసుకున్నారు. ఈ విషయాన్ని శిబానీనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మెడపై ఉన్న ఫర్హాన్ అక్తర్ అని ఉన్న టాటూ చిత్రాన్ని పంచుకున్నారు. ముందుగా దీనిని టాటూ ఆర్టిస్ట్ కే షేర్ చేయగా.. అంతరం శిబానీ రీపోస్టు చేశారు. ఈ ఫొటోలో ఆమె ముఖం పూర్తిగా కనిపించకపోయినా.. మెడపై పచ్చబొట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

శిబానీ, ఫర్హాన్ గత మూడేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రేమ బంధాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటినుండి శిబానీ దండేకర్, ఫర్హానాన్ అక్తర్ తరచూ ఇన్స్టాగ్రామ్ లో తమకు చెందిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవల వీరి పెళ్లి ప్రస్తావన రాగా.. వివాహం గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదని.. ఎప్పుడూ ఈ టాపిక్ మాట్లాడుకోలేదని అన్నారు. పెళ్లి ప్లాన్ ఉంటే మాత్రం కచ్చితంగా చెబుతామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. ఫర్హాన్ ఇదివరకే అధునా భబానీని అనే హెయిర్ స్టయిలిష్ట్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ఫర్హాన్ తన భార్య నుండి విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఫర్హాన్ నటించిన ‘తుఫాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus