ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ శిల్పాశెట్టి కెరీర్ పై ప్రభావం చూపిస్తోంది. ఆమె బ్రాండ్ తో పాటు.. ఆమె చేస్తున్న పలు కార్యక్రమాలపై ఆ ప్రభావం పడుతుందని అనుమానించారు. దానికి తగ్గట్లే జరుగుతోంది. భర్త అరెస్ట్ కావడంతో.. శిల్పా తన ఆదాయాన్ని కోల్పోతుంది. ప్రస్తుతం సూపర్ డాన్సర్ చాప్టర్ 4కి జడ్జిగా వ్యవహరిస్తోంది శిల్పాశెట్టి.
ఒక్కో ఎపిసోడ్ కి ఆమె రూ.18 లక్షల నుండి రూ.22 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. ఎప్పుడైతే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడో అప్పటినుండి ఆమె షూటింగ్ కు రావడం లేదు. అలా మొత్తంగా రెండు కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి శిల్పా శెట్టి స్థానంలో ఓ ఎపిసోడ్ కి కరిష్మా కపూర్ ను తీసుకొచ్చారు. మరో ఎపిసోడ్ కి జెనీలియా-రితేష్ వచ్చారు. ఎక్కువరోజులు ఇలా షో నడిపించలేరు.
దీంతో రాబోయే రోజుల్లో ఈ షోలో శిల్పాను కంటిన్యూ చేయాలా వద్దా అనే కఠిన నిర్ణయాన్ని కూడా ఛానెల్ యాజమాన్యం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే శిల్పాకు ఆర్థికంగా మరింత నష్టం కలుగుతుంది. మరో నెల రోజుల్లో శిల్పాశెట్టి షూటింగ్ కు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అప్పటికి రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తేనే.. లేకపోతే ఆమె మరిన్ని ఎపిసోడ్స్ కు గైర్హాజరవుతుంది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!