ప్రముఖ సినీ నటి రాజ్ కుంద్రా అరెస్ట్ గురించి ఎట్టకేలకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్పందించింది. పూర్తిగా విషయం తెలుసుకోకుండా వార్తలు సృష్టించవద్దని ఆమె అన్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. గత కొన్ని రోజులుగా ప్రతి విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నానని చెప్పింది. రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంపై ఎన్నో పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయని..
మీడియాతో పాటు అయినవాళ్లు కూడా తనను.. తన కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు అసలు మాట్లాడలేదని.. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై మాట్లాడాలనుకోవడం లేదని తెలిపింది. ముంబై పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పింది. దయచేసి తన గురించి అసత్య ప్రచారంలో చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. ఒక తల్లిగా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అడుగుతున్నానని..
అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్స్ చేయొద్దని చెప్పుకొచ్చింది. పోర్న్ కంటెంట్ ను చిత్రీకరిస్తూ.. వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!